511

దేవ సంస్తుతి చేయవే మనసా

దేవ సంస్తుతి చేయవే మనసాశ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసాదేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవునిపావన నామము నుతించుమా – నా యంతరంగములో వసించు నో సమస్తమా ||దేవ||1. జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2)నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బులేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే ||దేవ||2. చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2)జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీదజీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే ||దేవ||3. యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2)యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదుభావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే ||దేవ||4. ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ (2)విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములనువిప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే ||దేవ||5. అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడునీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే ||దేవ||6. పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)భూమి కన్న నాకాసంబున్న – ఎత్తుండు దైవప్రేమ భక్తి జనులయందున – ఆ కారణముచే ||దేవ||7. పడమటికి తూర్పెంత ఎడమో – పాపములను మనకు నంత (2)ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములనుఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే ||దేవ||8. కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల (2)యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరులయెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే ||దేవ||9. మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి (2)మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసికొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే ||దేవ||10. పూసి గాలి వీవ నెగిరి – పోయి బసను దెలియని వన (2)వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే ||దేవ||11. పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2)నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతితరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే ||దేవ||