148

దేవుని ప్రేమ యిదిగో – జనులారా భావంబునందెలియరే

దేవుని ప్రేమ యిదిగో – జనులారా భావంబునందెలియరేకేవలము నమ్ముకొనిన – పరలోక జీవంబు మనకబ్బును1. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో జేసెనుసర్వోపకారుడుండే – మన మీద జాలిపరుడై యుండెను2. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెనుమన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపమునకు దూరుడే3. యేసు క్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపలదోసకారిజనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు4. పాప భారంబుతోడ నే ప్రొద్దు – ప్రయాసములు బొందెడిపాపులందురు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణ మిత్తుననెను5. సతులైన పురుషులైనన్‌ – యాకర్త సర్వజనుల యెడలనుసత్ప్రేమగ నడిచెను – పరలోక సద్భోదలిక జేసెను6. చావు నొందిన కొందరిన్‌ – యేసుండు – చక్కగా బ్రతికించెనుసకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి7. గాలి సంద్రపు పొంగులన్‌ – సద్ధణపి – నీళ్లపై నడచినాడేమేలుగల యద్భుతములు ఈలాగు వేలకొలదిగజేసెను8. చేతుల కాళ్లలోనూ రా రాజు – చేర మేకులు బొందెనుపాతకులు గొట్టినారే పరిశుద్ధ నీతి తామోర్వ లేకన్‌9. ఒడలు రక్తము గారగ దెబ్బలు చెడుగులందఱు గొట్టిరిపడి ముళ్లు తలమీదను బెట్టిరి ఓర్చెనో రక్షకుండు10. ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులనుమన్నించుమని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను11.రక్షకుడు శ్రమబొందగా దేశంబు తక్షణము చీకటియ్యెనురక్షకుడు మృతి నొందగా – తెర చినిగి – రాతి కొండలు పగులెను12. రాతి సమాధిలోను – రక్షకుని నీతిగల దేహంబునుపాతి పెట్టిరి భక్తులు – నమ్మిన నాతు లందఱు జూడగా13. మూడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాడునాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్‌14. పదినొకండు మారులు వారలకు – బ్రత్యక్షు డాయె నేసుపరలోకమున కేగెను – తన వార్త బ్రకటించు మని పల్కెను15. నమ్మి బాప్తిస్మ మొందు – నరులకు – రక్షణ మరి కల్గునునమ్మనొల్లక పోయెడు – నరులకు నరకంబు సిద్ధమనెను