#147దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గముమహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచునుఅభయ మభయ మభయ మెప్పు – డానంద మానంద మానంద మౌగ1. పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడిననుసర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్2. దేవుడెపుడు తోడుగాగ – దేశము వర్ధిల్లునుఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు3. రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించినపూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును4. విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయనచెల్ల చెదర జేసి రిపుల – నెల్ల ద్రుంచు నాయనే5. పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియునునశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును6. కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగాఏటి కింక వెరవ వలయు – నెపుడు నాకు బండుగ

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.