143

దేవా నీ గొప్ప కార్యములన్ మదిన్ తలంచి స్తుతించెదన్

దేవా నీ గొప్ప కార్యములన్ మదిన్ తలంచి స్తుతించెదన్నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదన్హల్లెలుయ నా యేసు నాధా హల్లెలుయా నా ప్రాణనాథాస్తుతులు మహిమా ఘనతా నీకే1. శాశ్వత ప్రేమతో నను ప్రేమించి పరమును విడచి భువికరుదెంచికలువరి సిలువలో రక్తము కార్చి నీదు కృపతో నను రక్షించినఅక్షయమైన నీ మధుర ప్రేమను దీక్షతో ఇలలో చాటెదను2. నీ కంటి పాపగా నన్ను కాచి నీ చేతి నీడలో నన్ను దాచినీ అరచేతిలో నను చెక్కుకొని నీదు సొత్తుగ నను చేసికొనిననీ దివ్య ప్రేమను అత్యధికముగా స్మరియింతున్ జీవిత కాలం...