498

చాలునయ్యా చాలునయ్యా

చాలునయ్యా చాలునయ్యానీ కృప నాకు చాలునయ్యా (2)ప్రేమామయుడివై ప్రేమించావుకరుణామయుడివై కరుణించావు (2)తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2)ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||1. జిగటగల ఊభిలో పడియుండగానా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యాహిమము కంటెను తెల్లగ మార్చయ్యానీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయానా జీవితమంతా అర్పింతు నీకయ్యాప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||2. బంధువులు స్నేహితులు త్రోసేసినాతల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)నన్ను నీవు విడువనే లేదయ్యామిన్నగ ప్రేమించి రక్షించినావయ్యానీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయానీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యాప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||