497

ఘనమైనవి నీ కార్యములు

ఘనమైనవి నీ కార్యములు నా యెడలస్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)కృపలను పొందుచు కృతజ్ఞత కలిగిస్తుతులర్పించెదను అన్నివేళలా (2)అనుదినము నీ అనుగ్రహమేఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||1. యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయకఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివిఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి||2. నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవేఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే (2)నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావుఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి||3. నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయాబహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే (2)నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి||