586

భారత దేశ సువార్త సంఘమా

భారత దేశ సువార్త సంఘమా – భువి దివి సంగమమాధర సాతానుని రాజ్యము కూల్చే – యుద్ధా రంగమా ||భారత||ఎవని పంపుదును నా తరపున – ఇల ఎవరు పోవుదురు నాకైనేనున్నాను నన్ను పంపమని – రమ్మూ సంఘమాభారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||అడవి ప్రాంతములు, ఎడారి భూములు – ద్వీపవాసులను గనుమాఅంధకార ప్రాంతములో ప్రభుని – జ్యోతిని వెలిగించను కనుమాభారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||బ్రతుకులోన ప్రభు శక్తిలేని – క్రైస్తవ జనాంగమును గనుమాకునుకు దివ్వెలను సరిచేయగ – ఉజ్జీవ జ్వాలగొని చనుమాభారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||