245

భాసిల్లెను సిలువలో పాపక్షమా

భాసిల్లెను సిలువలో పాపక్షమాయేసు ప్రభూ నీ దివ్య క్షమా1. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసికలుషహరా కరుణించితివి (2)2. పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినదికాపరివై నను బ్రోచితివి (2)3. ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికిఅందులకే భయమొందితిని (2)4. నమ్మిన వారిని కాదన వనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవనినమ్మితి నీ పాదంబులను (2)