246

భూమ్యాకాశములు సృజించిన – యేసయ్యా నీకే స్తోత్రం

భూమ్యాకాశములు సృజించిన – యేసయ్యా నీకే స్తోత్రంనీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదునుహల్లెలూయా లూయ హల్లెలూయా1. బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను దీన దశలో నేనుండగా నను విడువనైతివి2. జీవాహరమై నీదు వాక్యము పోషించెను నన్ను ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి3. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి4. నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి