396

అవధులే లేనిది దివ్యమైన నీ కృప

అవధులే లేనిది దివ్యమైన నీ కృపఅనంతమైనది ఆశ్చర్యమైనది (2)యేసయ్యా నాపై నీవు చూపిన కృపఅమూల్యమైనది వర్ణించలేనిది (2)1. ఊహించలేని హృదయానందమునుదుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2)భారమెక్కువైనా తీరం కడుదూరమైనానీపై ఆనుకొందునునేను గమ్యం చేరుకొందును (2)2. సరిపోల్చలేని మధురమైన అనుభవంవింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2)సౌందర్యమైన అతిపరిశుద్ధమైననీ రూపము తలచుకొందునునేను నీ కోసమే వేచియుందును (2)3. లెక్కించలేని అగ్ని శోధనలోప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2)వాడబారని కిరీటము నే పొందుటకువెనుకున్నవి మరచినేను లక్ష్యము వైపు సాగెద (2)