#3అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము – నీకే అర్పించి కీర్తింతునునీవు నా పక్షమై నను దీవించగానీవు నా తోడువై నను నడిపించగాజీవింతును నీ కోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా1. సర్వోన్నతమైన స్థలముల యందు – నీ మహిమ వివరింపగాఉన్నతమైన నీ సంకల్పము – ఎన్నడూ ఆశ్చర్యమేముందెన్నడూ చవి చూడని – సరికొత్తదైన ప్రేమా మృతంనీలోనే దాచావు ఈనాటికై – నీ ఋణము తీరదు ఏనాటికీ2. సద్గుణ రాశి నీ జాడలను – నా ఎదుటే నుంచుకొనిగడిచిన కాలం సాగిన పయనం – నీ కృపకు సంకేతమేకృప వెంబడి కృప పొందగా – మారాను మధురముగా నే పొందగానాలోన ఏ మంచి చూశావయ్యా – నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా3. సారెపై నున్న పాత్రగ నన్ను – చేజారి పోనియ్యకశోధనలెన్నో ఎదిరించినను – నను సోలి పోనియ్యకఉన్నావులే ప్రతి క్షణమునా – కలిసున్నావులే ప్రతి అడుగునానీవేగా యేసయ్య నా ఊపిరి – నీవేగా యేసయ్యా నా కాపరి

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.