#17అసలైన క్రిస్మస్ మన జీవితమే
అసలైన క్రిస్మస్ మన జీవితమే-ఆరాధన అంటే జీవన విధానమే-2క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే-ఇంటా బయట క్రీస్తును ప్రతిబింబించడమేక్రిస్మస్ అంటే క్రీస్తులా జీవించడమే-ఏదేమైన దేవుని చిత్తం చేయడమేమాటల్లో ఆరాధన-చేతల్లో ఆరాధన-బ్రతుకంతా ఆరాధన-అదేగా మనకు దీవెన-21. క్రిస్మస్ తారను చూడు-వెదజల్లే వెలుగును చూడుజ్ఞానులకే మార్గము చూపిన-దేవుని జ్ఞానం చూడు -2దేవుని కొసం వెలిగే తారవు నీవైతే-క్రీస్తుని చేరే మార్గం లోకం కనుగొనదా-2ఇదియే ఆరాధన- నిజ క్రిస్మస్ ఆరాధనమాటల్లో ఆరాధన-చేతల్లో ఆరాధన-బ్రతుకంతా ఆరాధన-అదేగా మనకు దీవెన-22. పశువుల తొట్టెను చూడు-పవళించిన క్రీస్తును చూడుప్రజలందరిని రక్షించుటకై దాసుని రూపము చూడు-2క్రీస్తుకు ఉన్న దీన స్వభావం నీకుంటేదేవుని ప్రేమ నలుదిశలా వ్యాపించునుగా -2ఇదియే ఆరాధన-నిజ క్రిస్మస్ ఆరాధనమాటల్లో ఆరాధన-చేతల్లో ఆరాధన-బ్రతుకంతా ఆరాధన-అదేగా మనకు దీవెన-23. గొల్లలు జ్ఞానులు చూడు-శుభవార్తను నమ్మిరి చూడుయేసును చూసే ఆశను కలిగి ముందుకు సాగిరిచూడు-2యేసుని చూసే ఆశను కలిగి జీవిస్తే-దేవుడు నిన్ను నిశ్చయముగ దర్శించునుగా -2ఇదియే ఆరాధన-నిజ క్రిస్మస్ ఆరాధనమాటల్లో ఆరాధన-చేతల్లో ఆరాధన-బ్రతుకంతా ఆరాధన-అదేగా మనకు దీవెన-2

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.