12

అపరాధిని యేసయ్యా కృప జూపి బ్రోవుమయ్యా

అపరాధిని యేసయ్యా కృప జూపి బ్రోవుమయ్యానెప మెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు1. సిలువకు నిను నే గొట్టితిని తులువలతో జేరితినికలుషంబులను మోపితిని దోషుoడ నేను ప్రభువా2. ప్రక్కలు బల్లెపు పోటు గ్రక్కున పోడిచితి నేనేమిక్కిలి బాధించితిని మక్కువ జూపితివయ్యో3. ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితినా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రీ4. ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితివిక్రూరుoడనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా