#429అంకితం ప్రభూ నా జీవితం
అంకితం ప్రభూ నా జీవితంనీ చరణాల సేవకే అంకితమయ్యా (2)నీ సేవకై ఈ సమర్పణాఅంగీకరించుము నాదు రక్షకా (2) ||అంకితం||1. మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవానిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువానీ కృపలో బహుగా ఫలించుటకుఫలింపని వారికి ప్రకటించుటకు (2)అంగీకరించుము నా సమర్పణ ||అంకితం||2. కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవాచీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువానీ సన్నిధిలో ప్రకాశించుటకుఅంధకార ఛాయలను తొలగించుటకు (2)అంగీకరించుము నా సమర్పణ ||అంకితం||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.