#6అందాలతార అరుదెంచె
అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలోఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని1. విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెనువింతైన శాంతి వర్షించె నాలో విజయపథమునవిశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షతోవిరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్2. యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచుఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితియేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలోఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు3. ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమేబాలునిజూడ జీవితమెంత పావనమాయెనుప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యముబ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.