#438ఆనందం నీలోనే
ఆనందం నీలోనే – ఆధారం నీవేగాఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడుఅర్హతేలేని నన్ను – ప్రేమించినావుజీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై ||ఆనందం||1. పదే పదే నిన్నే చేరగాప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2)కాపాడే కవచంగా – నన్ను ఆవరించినదివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా ||ఆనందం||2. నిరంతరం నీవే వెలుగనినిత్యమైన స్వాస్థ్యం నీదని (2)నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా (2)నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనాసత్యవాక్యమే – జీవవాక్యమే ||ఆనందం||3. సర్వసత్యమే నా మార్గమైసంఘక్షేమమే నా ప్రాణమై (2)లోక మహిమ చూడక – నీ జాడలు వీడక (2)నీతోనే నిలవాలి నిత్య సీయోనులోఈ దర్శనం – నా ఆశయం ||ఆనందం||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.