437

ఆధారం నాకు ఆధారం

ఆధారం నాకు ఆధారంనాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారంఆశ్రయమూ నాకు ఆశ్రయమూఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూతల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నాలోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా ||ఆధారం||1. భక్తిహీన బంధంలో నేనుండగాశ్రమల సంద్రంలో పడియుండగా (2)ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా (2)నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||2. దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికినీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా (2)విడువను ఎడబాయనని పలికిన నా దేవా (2)నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||3. దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవాఅవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా (2)చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా (2)నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||