37

ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా

ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకాద్రోహ రహిత చంపె నిను నా దోషమే గదా1. వీరలను క్షమించు తండ్రి నేర రేమియున్కోరి తిటులు నిన్ను జంపు క్రూర జనులకై2. నీవు నాతో బరదైసున నేడె యుందువుపావనుండ యిట్లు బలికి పాపి గాచితి3. అమ్మా! నీ సుతుడ టంచు మరియమ్మతో బలికిక్రమ్మర నీ జనని యంచు గర్త నుడివితి4. నా దేవ దేవ యేమి విడ నాడితి వనుచుశ్రీ దేవ సుత పలికితివి శ్రమ చెప్పశక్యమా5. దప్పికొనుచున్నా నటంచు జెప్పితివి గదయిప్పగిదిని బాధనొంద నేమి నీకు హా!6. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్ద మెత్తి హాసమాప్తమైన దంచు దెలిపి సమసితివి గదా7. అప్పగింతు తండ్రి నీకు నాత్మ నంచునుగొప్ప యార్భాటంబు చేసి కూలిపొతివా