283

యేసు నాథా దేవా వందనాలు రాజా.. వందనాలు

యేసు నాథా దేవా వందనాలు రాజా.. వందనాలురాజాధి రాజా నీకే వందనాలు రవి కోటి తేజా నీకే వందనాలు (2)1. పాపిని కరుణించి ప్రాణ దానమిచ్చావుపరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి (2)పన్నెండు గుమ్మముల…పట్టణమే నాకు కట్టిపెట్టినావా2. నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావునీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు (2)నీ నీతి నీ రాజ్యం…నిండైన నా భాగ్యమే3. హీనుని దీవించి ఘనునిగా చేసావునీ రుధిరమే కార్చి నా ఋణము దీర్చావు (2)నా సల్లనయ్యా…నా యన్న నీవే నా యేసయ్యా4. కన్ను మిన్ను గానకుండా నిన్ను మీరిపోయానుచిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు (2)నీ మనసే వెన్నయ్యా…నా కన్న తండ్రి నా యేసయ్యా