#65ఎన్ని తలచినా ఏది అడిగినా
ఎన్ని తలచినా ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే (2) ప్రభువానీ వాక్కుకై వేచియుంటిని – నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా1. నీ తోడు లేక నీ ప్రేమ లేక – ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) – నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా2. నా ఇంటి దీపం నీవే అని తెలసి – నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)ఆరిపోయిన నా వెలుగు దీపము (2) – వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా3. ఆపదలు నన్ను వెన్నంటియున్నా – నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)లోకమంతయూ నన్ను విడచినా (2) – నీ నుండి వేరు చేయవు (2) ప్రభువా4. నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి – నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)నీదు యాగమే నా మోక్ష మార్గము (2) – నీయందే నిత్యజీవము (2) ప్రభువా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.