272

యెహోవా నా మొఱ లాలించెను

యెహోవా నా మొఱ లాలించెను దన మహాదయను నను గణించెనుఅహర్నిశల దీనహీనుడగు నా దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను1. పిశాచి గడిమి బడ గోట్టెను దన వశాన నను నిలువబెట్టెనుప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేదదీర్చెను2. మదావళము బోలు నామాదిన్ దన ప్రదీప్త వాక్యంకుశాహతిన్యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరికిదరికి జేర్చెను3. అనీతి వస్త్రము ఎడలించెను యేసునాధు రక్తమున ముంచెనువినూత్న యత్నమేదనూని ఎన్నడుగనన్ వినన్ ప్రేమనాకు చూపెను4. విలాపములకు జెవి నిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెనుశిలానగము పైకి లాగి నను సుఖ కళావళుల మనసులోన నిలిపెను5. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచకతెగించి మృతికొప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నణంచెను