71

ఏ పాపమెరుగని – యో పావన మూర్తి

ఏ పాపమెరుగని – యో పావన మూర్తి – పాప విమోచకుండనా పాలిదైవమా – నా పాపముల కొర – కీపాట్లు నొందినావా – 21. ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరాముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సొమ్మ – సిల్లిపోతివ రక్షకా – 22. కలువరిగిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావాసిలువ నీతో మోయ – దులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా – 23. చెడుగు యూదులు బెట్టు – పడరానిపాట్లకు – సుడివడి నడిచినావాకడకు కల్వరిగిరి – కడకేగి సిల్వను – గ్రక్కున దించినారా – 24. ఆ కాలకర్ములు – భీకరంబుగ నిన్ను – యా కొయ్యపై నుంచిరానీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా – 25. పలు విధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివాసిలువపై బలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహమునాయెనా – 2