323

వినరే యో నరులారా – వీనుల కింపు మీర

వినరే యో నరులారా – వీనుల కింపు మీరమనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరేఅనుదినమును దే-వుని తనయుని పదవనజంబులు మన-మున నిడికొనుచును1. నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మనిదురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడుకర మరు దగు క-ల్వరి గిరి దరి కరిగి రయంబున ప్రభు – కరుణను గనరే2. ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్షబూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెనుదీన దయా పరు-డైన మహాత్ముడుజానుగ యాగము – సలిపిన తెరంగిది3. ఇల మాయావాదుల మాని – యితడే సద్గురు డనితలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికినిల జనులకు గలు-ములనలరెడు ధనికుల కందని సుఖ-ములు మరి యొసఁగును4. దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచినిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనెబిరబిర మన మం-దర మా కరుణాశరనిధి చరణ మె – శరణని పోదము