320

వందనం బొనర్తుమో ప్రభో ప్రభో

వందనం బొనర్తుమో ప్రభో ప్రభోవందనం బొనర్తుమో ప్రభో ప్రభోవందనంబు తండ్రి, తనయ, శుద్ధాత్ముడావదనంబు లందు కో ప్రభో1. ఇన్ని నాళ్లు ధరను మమ్ము బ్రోచియుగన్న తండ్రి మించి యెపుడు గాచియుఎన్నిలేని దీవెన లిడు నన్న యేసువాయన్ని రెట్లు స్తోత్రము లివిగో2. ప్రాత వత్సరంపు బాప మంతయుబ్రీతిని మన్నించి మమ్ము గావుమునూత నాబ్దమనను నీదు నీతి నొసగు మాదాత క్రీస్తు నాధ రక్షకా3. దేవ మాదు కాలుసేతు లెల్లనుసేవకాళి తనువు దినము లన్నియునీవొసంగు వెండి, పసిడి జ్ఞాన మంత నీసేవకై యంగీకరించుమా4. కోతకొరకు దాసజనము నంపుముఈ తరి మా లోటుపాట్లు దీర్చుముపాతకంబు లెల్ల మాపి భీతి బాపుముఖ్యాతి నొందు నీతి సూర్యుడా5. మా సభలను పెద్దజేసి పెంచుమునీ సువార్త జెప్ప శక్తి నీయుముమోసపుచ్చు నంధకార మంత ద్రోయుముయేసు కృపన్ గుమ్మరించుము