505

తనువు నా దిదిగో గై కొనుమీ

తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీదినములు క్షణములు – దీసికొని యవి నీదువినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ ||తనువు||1. ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగోయనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకుదనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో ||తనువు||2. స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ముమరియు పెదవు లివిగో – మహనీయమైన నీపరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు ||తనువు||3. వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరనునిండైన నీ యిష్ట – నియమంబు చొప్పునమెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో ||తనువు||4. నా యిష్ట మిదిగో యిది – నీ యిషముగ జేయ – నా యిష్ట మిక గాదదినా యిచ్ఛ యున్నట్టి – నా హృదయ మిదిగో నీకే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ ||తనువు||5. ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధార వోయన్నన్ను నీ వానిగ – నాథా గైకొను మెపుడుచెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద ||తనువు||