130

తండ్రీ దేవా… తండ్రీ దేవా…

తండ్రీ దేవా… తండ్రీ దేవా…నా సర్వం నీవయ్యానీవుంటే నాకు చాలు (2)నా ప్రియుడా నా ప్రాణమా – నిన్నారాధించెదన్నా జీవమా నా స్నేహమా – నిన్నారాధించెదన్ (2)1. నీ ప్రేమ వర్ణించుట – నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట – నా బ్రతుకు చాలదయ్యా (2) తండ్రీ దేవా… నా ఆనందమా… నీ ఒడిలో నాకు సుఖము (2)2. నా ప్రాణ స్నేహితుడా – నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా – నీ ప్రేమ మధురమయ్యా (2) తండ్రీ దేవా… నా ఆనందమా… నీ ఒడిలో నాకు సుఖము (2)