#363స్తుతించెదను స్తుతించెదను – నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము
స్తుతించెదను స్తుతించెదను – నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము1. ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక (2) ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని (2) ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను (2)2. నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి (2) నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప (2) నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి (2)3. పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి (2) పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన (2) పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా (2)4. తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును (2) దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా (2) దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి (2)5. సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన (2) స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా (2) శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా (2)
Previous Songస్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు
Next Songస్తుతియించెద నీ నామం దేవా అనుదినం

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.