#359స్తుతి సింహాసనాసీనుడా – నా ఆరాధనకు పాత్రుడా
స్తుతి సింహాసనాసీనుడా – నా ఆరాధనకు పాత్రుడా (2)నీవేగా నా దైవము – యుగయుగాలు నే పాడెదన్ (2)1. నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి (2)నీ కోసమే – నీ కృప కోసమే (2)నీ సముఖములో నిలిచానయ్యా – యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2)2. నీ సేవలోనే తరియించాలని – నీ దరికి ఆత్మలను నడిపించాలని (2)నీ కోసమే – నీ కృప కోసమే (2)నీ నీడలో నిలిచానయ్యా – యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2)3. నా ఆశయముతో నా కోరికతో – నా గురి నీవని పరుగిడుచుంటిని (2)నీ కోసమే – నీ కృప కోసమే (2)నీ వెలుగులో నిలిచానయ్యా – యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2)
Previous Songస్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా
Next Songస్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.