418

స్తోత్రింతుము నిను మాదు తండ్రి

స్తోత్రింతుము నిను మాదు తండ్రిసత్యముతో ఆత్మతో నెప్పుడు (2)పరిశుద్ధాలంకారములతోదర్శించెదము శరణం శరణం (2)1. శ్రేష్ఠ యీవుల యూట నీవేశ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2)త్రిత్వమై ఏకత్వమైన త్రి-లోకనాథ శరణం శరణం (2)2. దవలవర్ణుడ రత్నవర్ణుడసత్యరూపి యనబడువాడా (2)నను రక్షించిన రక్షకుండవునాథ నీవే శరణం శరణం (2)3. సంఘమునకు శిరస్సు నీవేరాజా నీకే నమస్కారములు (2)ముఖ్యమైన మూలరాయికోట్లకొలది శరణం శరణం (2)4. నీదు సేవకుల పునాదిజ్ఞానమునకు మించిన తెలివి (2)అందముగనూ కూడుకొనుచువేడుకొందుము శరణం శరణం (2)5. రాజ నీకే స్తుతి స్తోత్రములుగీతములు మంగళ ధ్వనులు (2)శుభము శుభము శుభము నిత్యంహల్లెలూయా ఆమెన్ ఆమెన్ (2)