#417జీవితాంతము వరకు నీకే
జీవితాంతము వరకు నీకేసేవ సల్పుదు నంటినినీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము రక్షకా1. ఎన్ని యాటంకంబు లున్ననుఎన్ని భయములు కల్గినఅన్ని పోవును నీవు నాకడనున్న నిజమిది రక్షకా2. అన్ని వేళల నీవు చెంతనెయున్న యనుభవ మీయవెతిన్నగా నీ మార్గమందునపూని నడచెద రక్షకా3. నేత్రములు మిరుమిట్లు గొలిపెడిచిత్ర దృశ్యములున్ననుశత్రువగు సాతాను గెల్వనుచాలు నీకృప రక్షకా4. నాదు హృదయమునందు వెలుపలనావరించిన శత్రులన్‌చెదర గొట్టుము రూపుమాపుముశీఘ్రముగ నా రక్షకా5. మహిమలో నీవుండు చోటికిమమ్ము చేర్చెదనంటివేఇహము దాటినదాక నిన్నువీడనంటిని రక్షకా6. పాప మార్గము దరికి బోవకపాత యాశల గోరకఎపుడు నిన్నే వెంబడింపగకృప నొసంగుము రక్షకా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.