421

స్తోత్రించి కీర్తించెదము

స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయస్తుతి - చెల్లించి యుల్లసింతము హల్లెలూయఅనుపల్లవి:గడచిన కాలమెల్ల - కంటిపాపవలెకాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్1. పాపమును బాపినాడు హల్లెలూయ - మనశాపమును మాపినాడు హల్లెలూయకన్నతల్లివలెనె - కనికరించెను మమ్ముయెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్2. తల్లియైన మరచినను హల్లెలూయ - తానుఎన్నడైన మరచిపోడు హల్లెలూయఎల్ల యీవుల నిచ్చి యులాస మొసగునుకొల్లగ మనల కోరి హల్లెలూయ - ప్రభున్3. శోధన కాలములందు హల్లెలూయ - మనమేధన కాలములందు హల్లెలూయనాథుడు యేసు మన చెంతనుండ నిలచింత లేమియు రావు హల్లెలూయ - ప్రభున్4. ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ - బహుఘోరముగ లేచినను హల్లెలూయదోనెయందున్న యేసు - దివ్యముగను లేచిధాటిగా వాటి నణచు హల్లెలూయ - ప్రభున్5. సర్వలోకమునందున హల్లెలూయ - నన్నుసాక్షిగ నించెను యేసు హల్లెలూయచేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసుచేర్చును కౌగిటిలో హల్లెలూయ - ప్రభున్