345

సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు

సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయుపౌలు వలెను, సీల వలెను సిద్ధపడిన భక్తుల జూచి1. కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించుపండియున్న పాపులనైన పిలచుచుండె పరముజేర2. వందగొర్రెల మందలో నుండి ఒకటితప్పి ఒంటరియాయెతొంబదితొమ్మిది గొర్రెల విడచి ఒంటరియైన గొర్రెను వెదకెన్3. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయెతప్పు తెలిసి తిరిగిరాగా తండ్రియతని చేర్చుకొనెను4. పాపిరావా పాపము విడిచి పరిశుద్ధుల విందులొజేరపాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి యంతం