336

సందేహమేల సంశయమదేలా

సందేహమేల సంశయమదేలా ప్రభు యేసు గాయములనుపరికించిచూడు గాయాలలో నీ వేళ్లు తాకించి చూడు1. ఆ ముండ్ల మకుటము నీకై ధరియించెనేనీ పాప శిక్షను యేసు భరియించెనేప్రవహించే రక్తధార నీ కోసమేకఠోర హింస నొందె నీ కోసమే2. లోకాన ఎవ్వరూ నీకై మరణించరునీ శిక్షలను భరియింప సహియింపరునీ తల్లియైన గాని నిన్ను మరచునేఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా3. ఎందుకా యేసుని నీవు యెరుగనందువాఎందుకా హృదయము బయట నిలువమందువాయేసయ్య ప్రేమ నీకు లోకువాయెనాయేసయ్య సిలువ సువార్త చులకనాయెనా4. ఈ లోక భోగములను వీడజాలవాసాతాను బంధకమందు సంతోషింతువాయేసయ్య సహనము తోట చెలగాటమాఈ నాడే రక్షణ దినము గ్రహియించుమా