304

రండి సువార్త సునాదముతో

రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతోతంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికియేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసంయేసే పతిత పావన నామం భాసుర క్రైస్తవ శుభనామంయేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతి రూపంయేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసంయేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవంయేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్థన సహకారంయేసే సంఘములో మన కాంతి యేసే హృదయములో ఘన శాంతియేసే కుటుంబ జీవన జ్యోతి పసిపాపల దీవెన మూర్తియేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గంయేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగ నమ్మిన జన స్తోత్రం