311

రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి

రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండిఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని1. కరుణ గల సోదరుండై ఈయన – ధరణికేతెంచెనయ్యా (2)స్థిరముగా నమ్ముకొనిన – మనకొసగు పరలోక రాజ్యమును2. నక్కలకు బొరియలుండే నాకాశ – పక్షులకు గూళ్లుండెను (2)ఒక్కింత స్థలమైనను – మన విభుని కెక్కడ లేకుండెను3. త్వరపడి రండి రండి ఈ పరమ – గురుని యొద్దకు మీరలు (2)దరికి జేరిన వారిని – ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము