#229మహిమలో నేనాయనతో ఉంటేచాలు
ప్రియ యేసు రాజును నే చూచినచాలు
ప్రియ యేసు రాజును నే చూచినచాలు-మహిమలో నేనాయనతో ఉంటేచాలు (2)నిత్యమైన మోక్షగృహము నందు చేరి – భక్తుల గుంపులో హర్షించిన చాలు (2)1. యేసుని రక్తమందు కడుగబడి-వాక్యంచే నిత్యం భద్రపరచబడి (2)నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2)-బంగారు వీదులలో తిరిగెదను (2)2. ముండ్ల మకుటంబైన తలను జూచి-స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2)కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2)-ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2)3. హృదయము స్తుతులతో నింపబడెను-నా భాగ్య గృహమును స్మరించుచు (2)హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (2)-వర్ణింప నా నాలుక చాలదయ్యా (2)4. ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో-ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో (2)తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో (2)-ఆశతో వేచియుండే నా హృదయం (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.