#227ప్రార్థన వలనే పయనము
ప్రార్థన వలనే పయనముప్రార్థనే ప్రాకారము – ప్రార్థనే ప్రాధాన్యముప్రార్థన లేనిదే పరాజయంఅను. పల్లవి: ప్రభువా ప్రార్థన నేర్పయ్యా – ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2) నీ పాదాలు తడపకుండా – నా పయనం సాగదయ్యా (2)1. ప్రార్ధనలో నాటునది – పెల్లగించుట అసాధ్యము ప్రార్ధనలో పోరాడునది – పొందకపోవుట అసాధ్యము (2) ప్రార్ధనలో ప్రాకులాడినది – పతనమవ్వుట అసాధ్యము – 2 ప్రార్ధనలో పదునైనది – పనిచేయక పోవుట అసాధ్యము – 22. ప్రార్ధనలో కన్నీళ్ళు – కరిగిపోవుట అసాధ్యము ప్రార్ధనలో మూల్గునది – మరుగైపోవుట అసాధ్యము (2) ప్రార్ధనలో నలిగితే – నష్టపోవుట అసాధ్యము – 2 ప్రార్ధనలో పెనుగులాడితే – పడిపోవుట అసాధ్యము – 2

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.