#569పరవాసిని నే జగమున ప్రభువా
పరవాసిని నే జగమున ప్రభువా (2)నడచుచున్నాను నీ దారిన్నా గురి నీవే నా ప్రభువా (2)నీ దరినే జేరెదనునేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని||లోకమంతా నాదని యెంచిబంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)అంతయు మోసమేగా (2)వ్యర్ధము సర్వమునుఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని||ధన సంపదలు గౌరవములుదహించిపోవు నీలోకమున (2)పాపము నిండె జగములో (2)శాపము చేకూర్చుకొనేలోకము.. శాపము చేకూర్చుకొనే ||పరవాసిని||తెలుపుము నా అంతము నాకుతెలుపుము నా ఆయువు యెంతో (2)తెలుపుము ఎంత అల్పుడనో (2)విరిగి నలిగియున్నానునేను.. విరిగి నలిగియున్నాను ||పరవాసిని||ఆ దినము ప్రభు గుర్తెరిగితినినీ రక్తముచే మార్చబడితిని (2)క్షమాపణ పొందితివనగా (2)మహానందము కలిగేనాలో.. మహానందము కలిగే ||పరవాసిని||యాత్రికుడనై ఈ లోకములోసిలువ మోయుచు సాగెదనిలలో (2)అమూల్యమైన ధనముగా (2)పొందితిని నేనుయేసునే.. పొందితిని నేను ||పరవాసిని||నా నేత్రములు మూయబడగానాదు యాత్ర ముగియునిలలో (2)చేరుదున్ పరలోక దేశము (2)నాదు గానము ఇదియేనిత్యము.. నాదు గానము ఇదియే ||పరవాసిని||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.