211

పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది

పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది (2)కరములు చాపి నిను కౌగలించి పెంచినకన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ1. నవ మాసం మోసి ప్రయోజకులను చేసినాకన్నబిడ్డలే నిను వెలివేసినా (2)తన కరములు చాపి ముదిమి వచ్చు వరకునిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆవేదనంత తొలగించును ప్రేమ2. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగినస్నేహితులే హృదయమును గాయపరచగా (2)మేలులతో నింపి అద్భుతములు చేసిక్షమియించుట నేర్పించెడి ప్రేమా శాంతితో నిను నడిపించెడి ప్రేమ