78

ఓ తల్లి కన్ననూ ఓ తండ్రి కన్ననూ

ఓ తల్లి కన్ననూ ఓ తండ్రి కన్ననూప్రేమించు దేవుడు క్షమియించు దేవుడుప్రేయసికన్నా ప్రేమించు దేవుడుప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ – కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమతల్లియైన మరచినా నిను మరువని ప్రేమప్రేమా ప్రేమా ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ2. పర్వతాలు తొలగినా తొలగిపోని ప్రేమపాపులనీ త్రోయక దరిచేర్చు ప్రేమప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమపరలోకమునకు నిన్ను జేర్చు ప్రేమప్రేమా ప్రేమా ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ