542

నిన్న నేడు నిరంతరం మారనే మారవు

నిన్న నేడు నిరంతరం మారనే మారవునా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2)నీవే నీవే నమ్మదగినా దేవుడవునీవు నా పక్షమై నిలిచేయున్నావు (2)యేసయ్యా నీ ప్రత్యక్షతలోబయలుపడెనే శాశ్వతా కృప నాకై (2)విడువదే నన్నెల్లప్పుడూ కృపవిజయపథమున నడిపించెనే కృప (2)విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు ||నిన్న||యేసయ్యా నీ కృపాతిశయముఆదరించెనే శాశ్వత జీవముకై (2)మరువదే నన్నెల్లప్పుడూ కృపమాణిక్య మణులను మరిపించేనే కృప (2)మైమరచితినే నీ కృప తలంచినప్పుడు ||నిన్న||యేసయ్యా నీ మహిమైశ్వర్యముచూపెనే నీ దీర్ఘశాంతము నాపై (2)ఆదుకునే నన్నెల్లప్పుడూ కృపశాంతి సమరము చేసెనే కృప (2)మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే ||నిన్న||