563

నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను

నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తానునాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2)నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2)నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా||లేక లేక వృద్ధాప్యమందుఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)ఇచ్చిన నీవే బలి కోరగా (2)తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా||సర్వము పోయి శరీరము కుళ్ళిననా అనువారే వెలివేసినా (2)ఆప్తులంతా శత్రువులైనా (2)అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా||నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేచావైనా అది నాకెంతో మేలే (2)ఇదిగో నేను ఉన్నానయ్యా (2)దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||