557

నీవు లేని చోటేది యేసయ్యా

నీవు లేని చోటేది యేసయ్యానే దాగి క్షణముండలేనయ్యానీవు చూడని స్థలమేది యేసయ్యాకనుమరుగై నేనుండలేనయ్యా (2)నీవు వినని మనవేది యేసయ్యానీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2)నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని||కయీను కౄర పగకు బలియైన హేబేలురక్తము పెట్టిన కేక విన్న దేవుడవుఅన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపుమరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2)చెవి యొగ్గి నా మొరనుయేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే||సౌలు ఈటె దాటికి గురియైన దావీదుప్రాణము కాపాడి రక్షించిన దేవుడవుసాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబునుగెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2)నీ తోడు నీ నీడయేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||