196

నీవు చేసిన ఉపకారములకు – నేనేమి చెల్లింతును

నీవు చేసిన ఉపకారములకు – నేనేమి చెల్లింతును (2)ఏడాది దూడలనా… వేలాది పోట్టేళ్ళనా (2)1. వేలాది నదులంత విస్తార తైలము – నీకిచ్చినా చాలునా(2)గర్భఫలమైన నా జేష్ట్యపుత్రుని – నీకిచ్చినా చాలునా(2)2. మరణపాత్రుడనైయున్న నాకై – మరణించితివ సిలువలో (2)కరుణచూపి నీ జీవమార్గాన – నడిపించుమో యేసయ్యా(2)3. విరిగి నలిగిన బలియాగముగను – నా హృదయమర్పింతును(2)రక్షణ పాత్రను చేబూని నిత్యము – నిను వెంబడించెదను(2)4. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు – నీకేమి చెల్లింతును (2)కపట నటనలు లేనట్టి హృదయాన్ని – అర్పించినా చాలునా(2)