553

నీ స్వరము వినిపించు ప్రభువా

నీ స్వరము వినిపించు ప్రభువానీ దాసుడాలకించున్ (2)నీ వాక్యమును నేర్పించుదానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము||ఉదయమునే లేచి – నీ స్వరము వినుటనాకు ఎంతో మధురముదినమంతటి కొరకు – నను సిద్ధపరచురక్షించు ఆపదలనుండి – (2) ||నీ స్వరము||నీ వాక్యము చదివి – నీ స్వరము వినుచునేను సరి చేసికొందునీ మార్గములో – నడుచునట్లుగానేర్పించుము ఎల్లప్పుడూ – (2) ||నీ స్వరము||భయ భీతులలో – తుఫానులలోనీ స్వరము వినిపించుముఅభయము నిమ్ము – ఓ గొప్ప దేవాధైర్య పరచుము నన్ను – (2) ||నీ స్వరము||నాతో మాట్లాడు – స్పష్టముగా ప్రభువానీ స్వరము నా కొరకేనీతో మనుష్యులతో – సరిచేసికొందునీ దివ్య వాక్యము ద్వారా – (2) ||నీ స్వరము||నేర్చుకున్నాను – నా శ్రమల ద్వారానీ వాక్యమును ఎంతోనన్నుంచుము ప్రభువా – నీ విశ్వాస్యతలోనీ యందు నిలచునట్లు – (2) ||నీ స్వరము||నా హృదయములోని – చెడు తలంపులనుచేధించు నీ వాక్యమునీ రూపమునకు – మార్చుము నన్నునీదు మహిమ కొరకేగా – (2) ||నీ స్వరము||