180

నీ కృప నిత్యముండును – నీ కృప నిత్య జీవము

నీ కృప నిత్యముండును – నీ కృప నిత్య జీవమునీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది – రక్షణ సంగీత సునాదము (2)1. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లెకృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)2. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లెప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2)3. అనుభవ అనురాగం కలకాలమున్నట్లెనీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2)