#169నాకెన్నో మేలులు చేసితివే – నీకేమి చెల్లింతును
నాకెన్నో మేలులు చేసితివే – నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతునుఅను. పల్లవి:హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే1. కృప చేత నన్ను రక్షించినావే – కృప వెంబడి కృపతో – నను బలపరచితివేనన్నెంతగానో ప్రేమించినావే – నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే2. నాకిక ఆశలు లేవనుకొనగా – నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివేనలుదిశల నన్ను భయమావరింప – నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే3. నా కాడి మోసి నా తోడు నీవే – నీ చేతి నీడలో – నను దాచియున్నావేఏ కీడు నాకు రాకుండ చేసి – నీ జాడలో నన్ను – నడిపించుచున్నావే4. నీ రాజ్యమందు నను చేర్చుకొందువు – రానున్న రారాజువు – నా రాజువు నీవునీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు – నను కొన్నవాడవు – నా వరుడవు నీవు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.