534

నా ప్రాణప్రియుడా యేసురాజా

నా ప్రాణప్రియుడా యేసురాజాఅర్పింతును నా హృదయార్పణవిరిగి నలిగిన ఆత్మతోనుహృదయపూర్వక ఆరాధనతో సత్యముగాఅద్భుతకరుడా ఆలోచనఆశ్చర్య సమాధాన ప్రభువాబలవంతుడా బహుప్రియుడామనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ||విమోచన గానములతోసౌందర్య ప్రేమ స్తుతులతోనమస్కరించి ఆరాధింతున్హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ||గర్భమున పుట్టిన బిడ్డలన్కరుణింపక తల్లి మరచునామరచినగాని నీవెన్నడుమరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణ||రక్షణాలంకారములనుఅక్షయమగు నీ యాహారమున్రక్షకుడా నాకొసగితివిదీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా ప్రాణ||నీ నీతిని నీ రక్షణనునా పెదవులు ప్రకటించునుకృతజ్ఞతా స్తుతులతోడనీ ప్రేమను నే వివరింతును విమోచకా ||నా ప్రాణ||వాగ్ధానముల్ నాలో నెరవేరెనువిమోచించి నాకిచ్చితివేపాడెదను ప్రహర్షింతునుహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||నా ప్రాణ||