403

నా ప్రాణానికి ప్రాణం

నా ప్రాణానికి ప్రాణం – నా జీవానికి జీవంనా హృదయానికి హృదయం నీవే నీవేనా పాదాలకు దీపం నా నావకు తీరంనా పయనానికి గమ్యం నీవే నీవేనా కొండ నీవే నా కోట నీవేనాకన్నీ నీవేలే యేసయ్యా1. ఒంటరి బ్రతుకున జంటగ నిలిచే తోడు నీవేచీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతివి నీవేఇమ్మానుయేలు నీవే – మహిమాన్వితుడవు నీవే (2)నా కన్నీ నీవేలే యేసయ్యా2. కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థతా నీవేవేదన రోదన శోధనలోన బలము నీవేయెహోవా రాఫా యెహోవా యీరే (2)నా కన్నీ నీవేలే యేసయ్యా3. కరుణతో కలుషము మాపే కర్తవు నీవేపాప క్షమాపణ శాప విమోచన ముక్తివి నీవేనా రక్షణ నీవెలే నిరీక్షణ నీవెలే (2)నా కన్నీ నీవేలే యేసయ్యా