526

నా జీవిత భాగస్వామివి నీవు

నా జీవిత భాగస్వామివి నీవునా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2)నాకే సమృద్దిగా నీ కృపను పంచావునా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా (2)నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవినీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి (2)నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివినీ సైన్యములో నన్ను చేర్చితివి (2) ||నా జీవిత||నీ దయగల మాటలే చేరదీసినవినీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి (2)నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివినీ విందుశాలకు నను చేర్చితివి (2) ||నా జీవిత||నీ దయగల తలంపులే రూపునిచ్చినవినీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి (2)నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావునీ అంతఃపురములో నను చేర్చుదువు (2) ||నా జీవిత||